Telangana: కృష్టా జలాల్లో న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించండి.. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తారా స్థాయికి చేరిన ఈ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ(Telangana)కు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు వచ్చే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సిఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

  Telangana: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఉత్తర్వులు విడుదల.. పూర్తి వివరాలు

  ఇదిలా ఉంటే తెలంగాణలో దళితబంధు పథకానికి సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. దళిత సాధికారతే లక్ష్యంగా ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇప్పటికే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో డబ్బులు అందజేశారు. అనంతరం హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో ఈ పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) లాంఛనంగా ప్రారంభించారు. ఐతే దళితులకు మాత్రమే కాదు.. గిరిజనులు, ఇతర సామాజికవర్గాల్లలోనూ పేదలందరికీ డబ్బులు ఇవ్వాలని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
  Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

  అంతేకాదు తమకూ బంధు పథకం అమలు చేయలని.. ముదిరాజ్, గౌడ సామాజికవర్గాలకు చెందిన పలువురు హుజురాబాద్‌లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కేవలం దళితులకు మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో బీసీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణ పేదలకూ బంధు పథకాన్ని తెస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆయా వర్గాల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది.
  Published by:Nikhil Kumar S
  First published: