Home /News /telangana /

కల్నల్ సంతోష్ ఫ్యామిలీని భోజనానికి పిలిచిన సీఎం కేసీఆర్

కల్నల్ సంతోష్ ఫ్యామిలీని భోజనానికి పిలిచిన సీఎం కేసీఆర్

కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్

కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్

సంతోష్ లేని లోటును తీరుస్తామని ధైర్యం చెప్పారని.. తమను సీఎం ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని ఆమె వెల్లడించారు. నచ్చిన డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చాచని సంతోషి చెప్పారు.

  అమర వీరుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఐతే సీఎం తమకు కొండంత భరోసా ఇచ్చారని.. కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రభుత్వానికి సంతోష్ బాబు భార్య సంతోషి ధన్యవాదాలు తెలిపారు. సంతోష్ లేని లోటును తీరుస్తామని ధైర్యం చెప్పారని.. తమను సీఎం ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని ఆమె వెల్లడించారు. నచ్చిన డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చాచని సంతోషి చెప్పారు.

  కాగా, సోమవారం సాయంత్ర సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్.. గాల్వన్ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు ఆయన ఇంట్లో నివాళి అర్పించారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు తెలంగాణ సీఎం. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లదండ్రులకు రూ.1 కోటి చెక్కును అందించారు సీఎం కేసీఆర్. ఎప్పుడు ఏం అవసరం ఉన్నా.. తమను సంప్రదించాలని సూచించారు.
  సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సీఎం కోరారు.
  First published:

  Tags: CM KCR, Suryapet, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు