Dalita bandhu: మార్చిలోపు వాళ్లందరికీ దళితబంధు.. ఎమ్మెల్యేలదే నిర్ణయం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

సీఎం కేసీఆర్

DalitaBandhu: వచ్చే మార్చిలోపు వివిధ నియోజకవర్గాల్లో అమలు చేయబోయే దళితబంధు పథకం విషయంలో ఎమ్మెల్యేలే కీలక భూమిక పోషిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Share this:
    రాబోయే మార్చిలోపు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గంలో కొంత మేర దళితబంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో దళితబంధు పథకంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఈ పథకంపై అనేక విషయాలను వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన మరో నాలుగు మండలాల్లోని మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు వచ్చే మార్చిలోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. వచ్చే మార్చిలోపు వివిధ నియోజకవర్గాల్లో అమలు చేయబోయే దళితబంధు పథకం విషయంలో ఎమ్మెల్యేలే కీలక భూమిక పోషిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లే లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు కూడా ఈ పథకం అమలుకు సంబంధించి అనుభవం వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

    ఆ తరువాత వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ. 20000 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకం అమలు చేసుకుంటామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది లబ్దిదారులకు దళితబంధు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పుడు ఎక్కువ గ్రామాలు తీసుకోవడంతో పాటు అనేక మండలాలను కవర్ చేసుకుంటామని అన్నారు.

    Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

    KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

    ఈ పథకం అమలులో ఎలాంటి నిబంధనలు ఉండవని అన్నారు. వేరే కులస్థుల దగ్గర రూ. 10 లక్షలు ఉంటే వాళ్లు ఏ విధంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటారో.. దళితబంధు పథకం తీసుకున్న వాళ్లు కూడా అదే విధంగా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. వాళ్లు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని.. కేవలం లెక్క కోసమే వారి నుంచి చిప్ ద్వారా సమాచారం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

    రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తన ఫోటో పెట్టుకున్నవారికే ఈ పథకం ఇస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాజకీయ పార్టీలు వేరైనంత మాత్రాన ఈ పథకం రాకుండా ఉండదని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: