Metro Rail | హైదరాబాదీలకు అందుబాటులో మరో కొత్త మెట్రో రైలు మార్గం...

జూబ్లి బస్టాండ్ - మహాత్మాగాంధీ బస్టాండ్ మధ్య నిర్మించిన మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ మెట్రో రైల్ కారిడార్‌ను ప్రారంభించారు.

news18-telugu
Updated: February 7, 2020, 8:16 PM IST
Metro Rail | హైదరాబాదీలకు అందుబాటులో మరో కొత్త మెట్రో రైలు మార్గం...
జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
  • Share this:
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు మరో కారిడార్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. జూబ్లి బస్టాండ్ - మహాత్మాగాంధీ బస్టాండ్ మధ్య నిర్మించిన మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ మెట్రో రైల్ కారిడార్‌ను ప్రారంభించారు. పచ్చ జెండా ఊపిన సీఎం కేసీఆర్ రైలును ప్రారంభించారు. ఈ మార్గం మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ చేరుకుంటుంది. 16 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించనుంది.

జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు జేబీఎస్ అనేది హైదరాబాద్‌లో అతి పెద్ద రెండో బస్ స్టేషన్. దానికి పక్కనే పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్‌కు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇది అత్యంత ఎత్తయిన మెట్రో స్టేషన్. దీన్ని 5 అంతస్తుల్లో నిర్మించారు. కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లో మొత్తం 69.2 కిలోమీటర్ల మెట్రో రూట్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఇప్పటికే హైదరాబాద్ సుమారు 150కి పైగా అవార్డులను అందుకుంది.



First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు