హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR Jharkhand tour: జార్ఖండ్ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్​ సోరెన్​, శిబు సోరెన్​లతో సమావేశం

CM KCR Jharkhand tour: జార్ఖండ్ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్​ సోరెన్​, శిబు సోరెన్​లతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ (CM KCR Jharkhand tour) చేరుకున్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ కుమార్​, మంత్రి శ్రీనివాస్ గౌడ్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ (CM KCR Jharkhand tour) చేరుకున్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ కుమార్​, మంత్రి శ్రీనివాస్ గౌడ్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ (CM KCR Jharkhand tour) చేరుకున్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ కుమార్​, మంత్రి శ్రీనివాస్ గౌడ్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు.  

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ (CM KCR Jharkhand tour) చేరుకున్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ కుమార్​, మంత్రి శ్రీనివాస్ గౌడ్​, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు.  రాంచీ విమానాశ్రయం చేరుకున్న వెంటనే సీఎం కేసీఆర్ (CM KCR) నేరుగా బిర్సా ముండా చౌక్ చేరుకుని స్వాతంత్రోద్యమ నాయకుడు, గిరిజన ఉద్యమ నేత, జార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ (Hemanth soren) అధికారిక నివాసానికి సీఎం కేసీఆర్  చేరుకున్నారు. కేసీఆర్ (CM KCR) ​ బృందానికి సీఎం హేమంత్​ సోరెన్​ కుటుంబం స్వాగతం పలికింది.  అనంతరం హేమంత్ సోరెన్, శిబు సోరెన్‌లతో కేసీఆర్​ బృందం సమావేశమయింది. రెండేళ్ల క్రితం చైనా సరిహద్దు వద్ద గాల్వన్( Galwan) లోయలో చెలరేగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా మరికొందరు భారత సైనికులు (Indian soldiers) అమరులైన విషయం తెలిసిందే. అప్పట్లో సీఎం కేసీఆర్ మిగతా భారతీయ సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్​ ఇప్పుడు జార్ఖండ్ పర్యటనకు (CM KCR Jharkhand tour) వెళ్లారు.

  బీజేపీకి వ్యతిరేకంగా జేఎంఎం..

  ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్​ నేరుగా రాంచీ  (CM KCR Jharkhand tour) వెళ్లారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ (CM KCR) బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.. రైతు సంఘాల నేత టికాయత్ లో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. జేఎంఎం (JMM) సైతం ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ (CM KCR) బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాంచీ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తోనూ జాతీయ రాజకీయాల పైన చర్చించే అవకాశం ఉంది.

  గాల్వానా అమరవీరులకు..

  2020లో మే నెలలో చైనా (china) సైన్యానికి భారత సైనికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణించిన వారిలో బిహార్‌కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

  రూ.10 లక్షల చొప్పున సాయం..

  ఆ హింసాత్మక ఘటనల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందినపుడు వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎంకేసీఆర్ (CM KCR) ప్రకటించారు. సీఎం అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు. కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లో పాల్గొని మృత్యువాత పడ్డ రైతుల కుటుంబాలకు కూడా కేసీఆర్​ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పరిహారం కూడా ఇచ్చే అవకాశం ఉంది.  ఎన్నికలు ముగిశాక..


  ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం, మిగతా అమర జవాన్ల కుటుంబాలకూ ఆర్థిక సహాయం చేస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు జరిగిన ఘర్షణలు, తదనంతర పరిణామాల తర్వాత చైనాకు భారత్ కు మధ్య దూరం గట్టిగానే పెరిగింది. ఈ క్రమంలో చైనాకు చెందిన పాపులర్​ టిక్ టాక్ యాప్​ సహా 59 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే.

  First published:

  Tags: CM KCR, Jharkhand, Telangana Politics

  ఉత్తమ కథలు