హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR at Bihar: కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

CM KCR at Bihar: కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

చైనా జవాన్లతో జరిగిన పోరాటంలో గల్వాన్ లోయలో అమరులైన బిహర్ (Bihar)సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) బిహార్​లో పర్యటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చైనా జవాన్లతో జరిగిన పోరాటంలో గల్వాన్ లోయలో అమరులైన బిహర్ (Bihar)సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) బిహార్​లో పర్యటించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి గల్వాన్‌ లోయలో మరణించిన ఐదుగురు బిహర్ (Bihar)సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.  ఈ  సందర్భంగా దేశ రాజకీయాలు తదితర జాతీయ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల నడుమ చర్చలు జరిగాయి.  అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలపై (central investigation agencies) కూడా సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. అయితే సీబీఐని బిహార్​లోకి అనుమతించకపోవడంపై సీఎం కేసీఆర్​ సమర్ధించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఇదే చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్​. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అన్నారు. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం కరెక్టు కాదని తెలిపారు.దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం  అన్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నీ ప్రైవేటీకరిస్తున్నారని, ప్రతిష్టాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయడం ఏంటని నిలదీశారు. మేకిన్ ఇండియా అనేది వట్టిమాటేనని, అన్ని వస్తువులు ఇతర దేశా ల నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, కానీ మరో పక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.నితీశ్‌ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్  చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీస్తోందని బీజేపీపై మండిపడ్డారు. అలాంటి బీజేపీని సాగనంపితేనే భారతదేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కాగా, మీడియా సమావేశం ముగిశాక సీఎం కేసీఆర్​ లాలూప్రసాద్​ యాదవ్​ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

First published:

Tags: Bihar, CM KCR

ఉత్తమ కథలు