హైదరాబాద్లో (Hyderabad) ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ ప్రజలకు వరాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో గిరిజనులకు 5-6 శాతం రిజర్వేషన్లు ఉండేవని గుర్తు చేసిన సీఎం.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాలని ప్రధానిని కోరుతున్నానన్న కేసీఆర్.. తమకు రావాల్సిన న్యాయమైన హక్కునే కోరుతున్నామన్నారు. మోదీ.. ఆ జీవో అమలు చేస్తారా? దాన్నే ఉరితాడు చేసుకుంటారా అన్న సీఎం.. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామన్నారు. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని స్పష్టం చేశారు.
చదువుకునే వారికి ఎంతైనా ఖర్చు పెడతం..
అయితే ఈ సభలో కేసీఆర్ తెలంగాణ గురుకులాల్లో (Telangana Gurukuls) చదువుకోవాలనుకునే విద్యార్థులకు (Students) తీపి కబురు అందించారు. సీఎం (CM KCR) మాట్లాడుతూ.. ‘‘కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నం. స్వరాష్ట్రంలో కడుపునిండా అన్నం పెట్టుకుంటా ఉన్నం. కల్యాణలక్ష్మి గానీ, ఇతర ప్రభుత్వ పథకాలు గానీ సమాజంలో అందరికీ అందించినట్లుగానే గిరిజన బిడ్డలకూ అందించుకుంటున్నం. ఇపుడు గర్వంగా ఉన్నది. ఎస్టీ గురుకులాల్లో చదివిన 200 మంది అద్భుతమైన ప్రతిభ చూపి, డాక్టర్లుగా,ఇతర గొప్ప చదువులల్లో ఉన్నరు. ఈ సంవత్సరమే మరిన్ని గిరిజన గురుకులాలను (Tribal Gurukuls) పెంచుతం. గిరిజన గురుకులాల్లో (Tribal Gurukuls) చదువుకునే వారికి ఎంతైనా ఖర్చు పెడతం. మీరు ఈ జాతి గర్వించే విధంగా బంగారు బిడ్డలుగా ఎదగాలె. గిరిజన ఆడబిడ్డలు కూడా బాగా చదువుకోవాలె. బాగు పడాలె. గిరిజన విద్యావంతులైన బిడ్డలు ఎక్కడున్నరంటే.. తెలంగాణలోనే అని అందరూ చెప్పుకోవాలె’’. అని అన్నారు.
అంతేకాదు ఇటీవల కొత్తగా మంజూరు చేసిన 33 బీసీ గురుకులాలు (BC Gurukuls), 15 డిగ్రీ కళాశాలలను వచ్చే నెలలోనే ప్రారంభించనున్నారు. బీసీ గురుకులాలను అక్టోబర్ 11న, డిగ్రీ కళాశాలలను (Degree colleges) అదే నెల 15న ప్రారంభిస్తారు. కొత్తగా ప్రారంభించనున్నవాటిలో 17 గురుకులాలను (Telangana gurukuls) బాలికలకు, మరో 16 గురుకులాలను బాలురకు కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల (BC Gurukuls) సంఖ్య 310కి పెరగనుంది.
గురుకులాలు ఎక్కడంటే..?
బాలికల గురుకులాలు (Girl Gurukuls) ఏర్పాటయ్యే జిల్లాలలో జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల , కరీంనగర్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం , నల్లగొండ ఉన్నాయి. ఇక మిగిలిన 16 జిల్లాల్లో బాలుర గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో బాలికల డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేయనున్నారు. బాలుర డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసే ప్రాంతాలలో మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం , మేడ్చల్, సిరిసిల్ల, నాగార్జునసాగర్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana students, Ts gurukula