Home /News /telangana /

TELANGANA CM KCR GRANDSON AND KTR SON HIMANSHU RAO CLARIFIES THAT HE WILL NOT ENTER POLITICS ANYTIME AK

KCR Grandson Himanshu: రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనవడు..

కేటీఆర్‌తో హిమాన్షు (ఫైల్ ఫోటో)

కేటీఆర్‌తో హిమాన్షు (ఫైల్ ఫోటో)

Himanshu: ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న హిమాన్షు.. ఎప్పటికైనా తన తండ్రి, తాత తరహాలోనే రాజకీయాల్లోకి వస్తారని.. వారిలాగే రాణిస్తారనే నమ్మకం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.

    మన దేశ రాజకీయాల్లో ఎక్కువగా వారసత్వమే కనిపిస్తుంటుంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వీటికి ప్రజల ఆమోదం కూడా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంలోని అనేక మంది రాజకీయాల్లో రాణిస్తోంది. ఆయన తనయుడు కేటీఆర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అన్నీ కుదిరితే టీఆర్ఎస్ తరపున తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి కేటీఆరే అవుతారనే వాదన కూడా ఉంది. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. వారి కుటుంబంలోని మూడో తరం, కేటీఆర్ తనయుడు హిమాన్షుపై అందరి దృష్టి నెలకొంది.

    ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న హిమాన్షు.. ఎప్పటికైనా తన తండ్రి, తాత తరహాలోనే రాజకీయాల్లోకి వస్తారని.. వారిలాగే రాణిస్తారనే నమ్మకం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. అయితే రాజకీయాలు, తాను రాజకీయాల్లోకి వస్తాననే అంశంపై హిమాన్షు కీలక వ్యాఖ్యలు చేశారు.



    ట్విట్టర్ ద్వారా తన అభిమతాన్ని తెలిపిన హిమాన్షు.. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని అన్నారు. తనకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయని.. వాటిని సాధించాల్సి ఉందని హిమాన్షు అన్నారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, KTR, Ktr son himanshu, Telangana

    తదుపరి వార్తలు