Home /News /telangana /

TELANGANA CM KCR FOCUS ON AGRICULTURE KEY MEETING ON MAY 21 BS

సర్కారు చెప్పిన పంటే వేయాలి.. దూకుడు పెంచిన కేసీఆర్.. 21న కీలక భేటీ..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావును ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావును ఆదేశించారు.

‘రైతుల్ని ధనవంతుల్ని చేయడమే నా కర్తవ్యం’.. ఇదీ సీఎం కేసీఆర్ నోట వినిపిస్తున్న మాట. అందుకే రైతులు ఏ పంట వేయాలి? దిగుబడి దక్కాలంటే ఏం చేయాలి? తదితర సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నారు.

    ‘రైతుల్ని ధనవంతుల్ని చేయడమే నా కర్తవ్యం’.. ఇదీ సీఎం కేసీఆర్ నోట వినిపిస్తున్న మాట. అందుకే రైతు బంధు పథకాన్ని చేపట్టారు.. కరోనా కష్టకాలంలో పంట మొత్తం కొనుగోలు చేశారు.. సందర్భానుసారం రైతులకు సూచనలు ఇస్తున్నారు.. ఇప్పుడు రైతులు ఏ పంట వేయాలి? దిగుబడి దక్కాలంటే ఏం చేయాలి? తదితర సూచనలు, సలహాలతో ముందుకు వెళ్తున్నారు. ఖరీఫ్‌లో అందరూ వరి మాత్రమే సాగు చేయాలని, లేకపోతే రైతు బంధు ఇవ్వబోమని నిన్నటి ప్రెస్ మీట్‌లో చెప్పిన సీఎం.. ఇప్పుడు రైతులకు ఏ పంట లాభం చేస్తుందన్న దిశగా చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే నియంత్రిత సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. దాని కోసం ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చించనున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరపుతున్నారు. ఈ సమావేశానంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందించనున్నారు. ఆ పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించనున్నారు. వ్యవసాయంపై మంచి పట్టున్న కేసీఆర్.. దూకుడు పెంచుతూ, ఖరీఫ్ పంటపై ఫోకస్ పెట్టడం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి వర్షాలు బాగా పడతాయని నిపుణులు చెబుతున్న తరుణంలో దిగుబడి దక్కే పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామం అని వ్యాఖ్యానిస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Agriculture, CM KCR, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు