Home /News /telangana /

TELANGANA CM KCR FIRED ON BJP FOR INSULTING MAHATMA GANDHI WHO BROUGHT FREEDOM TO THE COUNTRY PRV

CM KCR: జాతిపితను అవమానిస్తారా? దేశ చరిత్రను మలినం చేస్తారా? బీజేపీపై సీఎం కేసీఆర్​ ఫైర్​

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

దేశంలోని ఇతర రాష్ట్రాలతో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌ (Niti Ayog)లో మేథోమథనం జరగడం లేదని, భజన మృందంగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్లానింగ్‌ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్‌ తీసుకొచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ (PM Narendra modi) ఇచ్చిన ఏ హామీ నెరవేరడం లేదని అన్నారు. 8 ఏళ్ల నీతి ఆయోగ్‌ సాధించింది ఏం లేదని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ (Mahatma Gandhi)పై బీజేపీ అనుసరిస్తున్న తీరుపై కేసీఆర్​ ఫైర్​ అయ్యారు.  జాతిపితను , అహింసా మార్గంలో  దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని అవమానపరుస్తారా? అని ధ్వజమెత్తారు కేసీఆర్​. మహత్మాగాంధీని పూజించే వాళ్లు, గాంధీ వంశం అని చెప్పుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారని తెలియజేశారు సీఎం​.

  ఇంత ఆటవికమా..?

  ఎవరైనా దేశంలో వాళ్ల చరిత్రను వాళ్లే మలినం చేసుకుంటారా? ఆటవిక సమాజమా? అనాగరికతనా ఇది? అని ప్రశ్నించారు కేసీఆర్​. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అని ప్రశ్నించారు. బీజేపీకి (BJP) సంబంధించిన అనేక సంఘాలు (Wings) గాంధీజీని ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నాయని కేసీఆర్ (CM KCR)​ మండిపడ్డారు. మోదీ ఏమో నీతి ఆయోగ్​పై గాంధీ కళ్లద్దాల గుర్తు పెడతారని బీజేపీ సంఘాలు మాత్రం తుపాకులు ఎక్కుపెడుతాయని ఆరోపించారు సీఎం.  బీజేపీ సంఘాలు గాంధీకి (Gandhi) లేనటువంటి అవలక్షణాలు అంటగడుతున్నట్లు మండిపడ్డారు. ఏ దేశంలోనైనా ఇలా ఉంటుందా? అని ధ్వజమెత్తారు సీఎం.  సీఎం మాట్లాడుతూ.. ‘‘నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడంతో భారత్‌కు మంచి రోజులు వచ్చాయని ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తూ అది ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది. మేధోమధనానికి బొందపెట్టి, ప్రధానమంత్రో మరొకరో చెప్పిన మాటలకు భజన చేసే సంస్థగా మారిపోయింది. ప్లానింగ్ కమిషన్‌కు నిర్దిష్టమైన నియమనిబంధనలు ఉండేవి, రాష్ట్రాల బడ్జెట్లలో కూడా మార్గదర్శకత్వం వహించేది. కానీ నీతిఆయోగ్ అది కూడా చెయ్యలేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నీతి ఆయోగ్‌లో నీతి అంత ఉంది. ఏదో జరుతుందని ఆశిస్తే.. ఏం జరగలేదు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది.

  మోదీ వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతిఆయోగ్ సృష్టి ఒక జోక్ అయిపోయింది. దేశంలో ఇప్పటి వరకు లేనట్లు నానాటికీ దిగజారిపోతున్న పరిస్థితి. విద్వేషం, అసహనం పెరిగిపోయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో డిమాండ్లతో ధర్నాలు చేసేవారు. వీటితో కొన్నిసార్లు ఫలితాలు కూడా ఉండేవి. దేశ చరిత్రలో లేని విధంగా దేశ రైతాంగం మొత్తం రాజధానిలో 13 నెలలపాటు ధర్నా చేశారు. వారిలో 700-800 మంది చనిపోయారు. ఆ తర్వాత ప్రధాన మంత్రే క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కు తీసుకున్నారు.

  ఇది పరిస్థితి మెరుగైనట్లా? మేధోసంపత్తి పెరిగినట్లా? ఈ దుస్థితి మనం కళ్లారా చూస్తున్నాం. చేసిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చెయ్యలేదు. డీజిల్ రేట్లు, విత్తనాల రేట్లు అన్నీ పెరిగిపోయాయి. రైతుల ఆదాయం డబుల్ చేస్తామంటే.. వారి పెట్టుబడి రెట్టింపు అయింది కానీ రాబడి కాదు. దేశంలో మంచి నీళ్లు కూడా సరిగా లేవు. నీతి ఆయోగ్ ఏం సాధించింది? తాగు, సాగు నీరు ఉండదు. కరెంటు ఉండదు, ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. లక్షలాది పెట్టుబడులు విదేశాలకు వెళ్లిపోతున్నాయి. చివరకు ఉపాధి హామీ ఉద్యోగులు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే దౌర్భాగ్యం ఏర్పడింది.

  అంతర్జాతీయ వేదికపై మన దేశం పరువుపోతుంది. ఎంతో మంది మేధావులు, ఆర్థిక వేత్తలు సలహాలు ఇస్తున్నారు. కానీ కేంద్ర ఎవరినీ పిలవదు. మాట్లాడదు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది”. అన్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Mahatma Gandhi, PM Narendra Modi

  తదుపరి వార్తలు