తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై కేసీఆర్ సంచలన నిర్ణయం..

పరేడ్ గ్రౌండ్ కు బదులుగా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులు కూడా దీన్ని అంగీకరించారు.

news18-telugu
Updated: May 17, 2019, 8:00 PM IST
తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై కేసీఆర్ సంచలన నిర్ణయం..
కేసీఆర్ (File)
news18-telugu
Updated: May 17, 2019, 8:00 PM IST
భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బాంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను గొప్పగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్య, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను పిలిపించి ఎండలో కవాతు నిర్వహించడం, విద్యార్థులను కూడా రప్పించి ఎండలో ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు కొనసాగించవలసిన అవసరం ఉందా? లేదా? అనే విషయాలపై చర్చ జరిగింది.

పరేడ్ గ్రౌండ్ కు బదులుగా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులు కూడా దీన్ని అంగీకరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు నిర్వహించే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలో కూడా ఉత్సవాలలో కవాతులను మినహాయించడం సముచితంగా ఉంటుందని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎస్.కె..జోషిని ఆదేశించారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...