హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కేంద్రం యాసంగి ధాన్యం కొనేవరకు పోరాటం.. తగ్గేదేలే అన్న సీఎం కేసీఆర్

Telangana: కేంద్రం యాసంగి ధాన్యం కొనేవరకు పోరాటం.. తగ్గేదేలే అన్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: కేంద్రం ఇచ్చిన సూచన మేరకు వరి సాగు తగ్గించామని సీఎం కేసీఆర్ అన్నారు. గత యాసంగిలో 54 లక్షల్లో వరి పండించారని.. ఈసారి 35 లక్షల్లో మాత్రమే వరి పండించారని తెలిపారు.

  యాసంగి వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీ వెళతారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన సూచన మేరకు వరి సాగు తగ్గించామని సీఎం కేసీఆర్ అన్నారు. గత యాసంగిలో 54 లక్షల్లో వరి పండించారని.. ఈసారి 35 లక్షల్లో మాత్రమే వరి పండించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో సరాసరిగా 30 లక్షల్లో పండిన వరిని కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుందని... అనేక విషయాల్లో కేంద్రంలోని బీజేపీ (Bjp) ద్వంద వైఖరి అవలంభిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దేశమంతా ధాన్యం సేకరణలోనూ ఒకే విధానం ఉండాలని.. పంజాబ్, గుజరాత్‌కు ఒక నీతి, మిగతా రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని సీఎం కేసీఆర్ (CM Kcr) కోరారు. ఎంఎస్‌పీ నిర్ణయించేది బియ్యానికి కాదని.. అది ధాన్యానికి (Paddy) మాత్రమే అని కేసీఆర్ అన్నారు.

  వరి ధాన్యం తీసుకుని తమకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాన్ని ఏ రకంగా ప్రాసెస్ చేసుకుంటారో కేంద్రం ఇష్టమని కేసీఆర్ అన్నారు. మంత్రులు, ఎంపీలు చేసే విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని.. లేకపోతే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం చేస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో అనేక ఉద్యమాల తరువాత అక్కడి రైతుల పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్న కేసీఆర్.. తెలంగాణలోనూ అదే రకంగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అందరికీ రాజ్యాంగ రక్షణ ఉందని.. కానీ రైతులకు మాత్రం రక్షణ లేకుండా పోయిందని కేసీఆర్ అన్నారు. రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని వ్యాఖ్యానించారు.

  కశ్మీర్ ఫైల్స్ పేరుతో దేశ ప్రజల మధ్య విభజన తీసుకురావాలని కేంద్రం, బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అయ్యిందని.. ఇప్పటివరకు ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని ఆరోపించారు. కేంద్రం ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.


  CM KCR : తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం.. వరి పోరాటానికి డైరక్షన్..

  Bodhan shivaji Statue: శివాజీ ఏమైనా పాకిస్తాన్​ నుంచో.. బంగ్లాదేశ్​ నుంచో వచ్చిండా.. ఆయన విగ్రహం ఎందుకు పెట్టకూడదు.. బండి సంజయ్​ ఆగ్రహం

  ఇలాంటి వాటిపై పోరాటం చేస్తామని కేసీఆర్ అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తాను చెప్పిన విధంగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిందని.. గతంతో పోల్చితే ఆ పార్టీకి సీట్లు తగ్గాయని కేసీఆర్ వివరించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు