TELANGANA CM KCR DELHI TOUR UPDATE WILL MEET PRIME MINSTER MAINLY KCR FOCUS ON NATIONAL POLITICS NGS
CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. కేద్రంతో తాడో పేడో.. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై ప్రధానిని కలిసే ఛాన్స్.. జాతీయ రాజకీయాలపైనా ఫోకస్
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం కేసీఆర్
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఫోకస్ చేశారా..? అందకు ఉద్యమం చేస్తున్న రైతులకు కలుస్తారా..? ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందా?
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రధాన అజెండా ఏంటి..?
CM KCR Delhi tour: యాసంగి ధాన్యం సేకరణ కొనుగోళ్లపై తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ (CM KCR).. ఢిల్లీలో ఉన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అన్నది నేరుగా ప్రధానితోనే తేల్చుకోనేందుకు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime minster narndra Modi) తో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఏడాది లెక్కన ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా సూటిగా చెప్పాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన డిమాండ్. దీంతో పాటు నీటి వాటాల పంపకం, విభజన హామీల అమలు తదితర కీలక అంశాల్లో తెలంగాణ(Telangana)కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈ విషయాలన్నీ నేరుగా కేంద్రం దగ్గరే తేల్చుకోనున్నారు.
జాతీయ రాజకీయాలపైనా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. రైతు చట్టాల రద్దుకు ఉద్యమించిన రైతులకు సంఘీభావం ప్రకటిస్తారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటంబాలకు అండంగా ఒక్కో ఫ్యామిలీకి 3 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. కేంద్రం పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. కేంద్రం పాతిక లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నది KCR డిమాండ్. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు కాగా సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, అందుబాటులో ఉన్న మంత్రులతో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ఢిల్లీలోనే రెండు రోజుల పాటు ఉండనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే.. పీఎం నరేంద్ర మోదీని సైతం కలుస్తామని చెప్పారు.
ఈ సారి ప్రధానిని కలిసిన తరువాతే తిరిగి తెలంగాణకు రావాలనే పట్టుదలతో వెళ్తున్నారు. అందకే కచ్చితంగా రెండు లేదా నాలుగు రోజులు అనే కాకుండా, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చే వీలును బట్టి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం, బీజేపీల విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో క్లారిటీ కోరడం సీఎం కేసీఆర్ ముఖ్య అజెండా అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు..
దాంతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు నీటి వాటాలు నిర్ధారించే ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, విభజన హామీల అమలు దిశగా కేసీఆర్ వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ ఇవే అంశాలు మాట్లాడనున్నారు. కేంద్రం ఇచ్చే క్లారిటీని బట్టి యాసంగిలో వరి సాగు చేయాలా లేక ప్రత్యామ్నాయ పంటలు వేయాలా? అనే దానిపై ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రైతాంగానికి వివరణ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు.
వీటన్నిటికన్నా ముఖ్యంగా జాతీయ రాజకీయాలపైనా సీఎం కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయ పార్టీగా ఎదగడం లేదు.. బీజేపీకి వ్యతిరేకంటా కూటమి ఏర్పాటు చేయడంపైనా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మంత్రి అపాయింట్మెంట్ ఆలస్యం అయితే.. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పలు రాజకీయ పార్టీలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రైతు సమస్యలతో పాటు.. విభజన చట్టంలోని అంశాల అమలుపైనా ఫోకస్ చేస్తున్నారాయన. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపులపై స్పష్టతకు, వివాదాల పరిష్కారానికి ఇంకెన్నేళ్లు కావాలంటూ సూటిగా ప్రశ్నించారు. నీటి పంచాయతీకి ఫుల్స్టాప్ పెట్టేలా టైమ్‌బౌండ్ పరిష్కారం కోరుతున్నారాయన.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.