టీఎస్ ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీలో సమూల మార్పులకు ఆమోద ముద్ర వేసింది. ప్రైవేట్ బస్సులు, రూట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. 5100 రూట్లు, బస్సులను ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని తెలిపారు. లాభాలు వచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులను నడుపుతామని.. ఆర్టీసీకి నష్టాలు వచ్చిన రూట్లలో ప్రైవేట్ బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన కేంద్ర చట్టం ప్రకారమే ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తున్నామని చెప్పారు సీఎం.
కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని తీర్మానం.
5100 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం.
ఆర్టీసీకి నష్టాలు వచ్చే రూట్లలోనే ప్రైవేట్ బస్సులను నడుపుతాం.
లాభాలు వచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులను నడుపుతాం.
టికెట్ ధరలను నిర్ణయించేందుకు కమిటీని నియమిస్తాం.
విద్యార్థులు, జర్నలిస్టులు, వికలాంగుల బస్ పాసులు ప్రైవేట్ బస్సుల్లోనూ చెల్లుబాటవుతాయి.
ప్రైవేట్ రూట్లకు అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసింది.
ఆ చట్టం ప్రకారమే ప్రైవేట్ ట్రావెల్స్‌కు పర్మిట్లు ఇస్తున్నాం.
ఆర్టీసీ కార్మికులకు 67శాతం జీతాలు పెంచిన ఘనత మాదే.
ఆర్టీసీకి ఉన్న 8వేల బస్సుల్లో 2వేల బస్సులు మార్చాలి.
ఇది చట్టవిరుద్దమైన సమ్మె. ఆర్టీసీ కార్మికులది పనికి మాలిన డిమాండ్.
బ్లాక్ మెయిల్ విధానం ఉండకూడదని నిర్ణయం
ఆర్టీసీ,ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది.
ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టే ఉద్దేశం లేదు. కార్మికులకు మరో ఛాన్స్ ఇస్తున్నాం.
నవంబరు 5 లోపు సమ్మె చేస్తున్న కార్మికులంతా డ్యూటీలో చేరవచ్చు.
డ్యూటీలో చేరే కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం.
ప్రస్తుతం 5,100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు మంజూరు చేస్తున్నాం.
నవంబరు 5 లోపు విధుల్లో చేరకుంటే మిగిలిన బస్సులనూ ప్రైవేట్‌కే అప్పగిస్తాం
కార్మికుల ఆత్మహత్యలకు ప్రతిపక్షాలు, యూనియన్లే కారణం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా.?
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీని తొలగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, RTC Strike, Tsrtc