Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Singareni: బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  • Share this:
    సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్‌ను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు.

    ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు రిటైరయిన సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలా లాభాలు గడిస్తున్నారని అన్నారు. ఆ పని మనమే ఎందుకు చేయకూడదని.. లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేయడం శోచనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని అన్నారు.

    Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్.. అసలు కారణం ఇదే.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..

    KT RamaRao: ఆ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

    సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో నివేదికను తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: