Nayini Narasimha Reddy: నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఉద్యమ సహచరున్ని కోల్పోయానని ఆవేదన

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

news18-telugu
Updated: October 22, 2020, 11:54 AM IST
Nayini Narasimha Reddy: నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఉద్యమ సహచరున్ని కోల్పోయానని ఆవేదన
కేసీఆర్(ఫైల్ ఫొటో)
  • Share this:
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమ సమయంలో, ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరున్ని కోల్పోయానని అన్నారు. నాయిని మృతి టీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక లోకానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని నర్సింహారెడ్డి అర్ధరాత్రి కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల నాయినికి కరోనా సోకడంతో.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మంత్రులు కేటీఆర్, హారీష్‌రావు, ఇతర ముఖ్య నాయకులు ఆయనను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.



బుధవారం నాయిని ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. అపోలో ఆస్పత్రికి వెళ్లి నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading