ఏపీతో చేతులు కలిపి కృష్ణా-గోదావరిని కలుపుతాం: సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఎన్నో విమర్శలు చేశారని..కానీ ప్రపంచమంతా ఆ ప్రాజెక్టును పొగుడుతోందని చెప్పారు కేసీఆర్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజాప్రయోజనాల కోసం తమ పని తాము చేసుకుపోతామని స్పష్టంచేశారు తెలంగాణ సీఎం.

news18-telugu
Updated: August 29, 2019, 4:43 PM IST
ఏపీతో చేతులు కలిపి కృష్ణా-గోదావరిని కలుపుతాం: సీఎం కేసీఆర్
జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్)
  • Share this:
పాలమూరు ఎత్తిపోతల పథకంపై సమీక్ష సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఏపీతో చర్చలు జరుగుతున్నాయని.. నదుల అనుసంధానం జరిగితే రెండు రాష్ట్రాలు బాగపడతాయని చెప్పారు. గోదావరి నుంచి శ్రీశైలానికి నీళ్లు తరలించి రిజర్వాయర్‌లో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. రెండు నదులను కలిపి తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జగన్‌తో జరగబోయే తదుపరి సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందన్నారు తెలంగాణ సీఎం.

గోదావరి కృష్ణను అనుసంధానం చేద్దామని జగన్ కోరారు. గోదావరి నీటితో శ్రీశైలం ప్రాజెక్టును నింపుదామని ప్రతిపాదన తెచ్చారు. ఈ అంశంపై ఏపీతో చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శ్రీశైలం ద్వారా మహబూబ్ నగర్, దక్షిణ నల్గొండ, నాగార్జున సాగర్ ద్వారా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. దీనిపై నెక్ట్స్ మీటింగ్‌లో కొలిక్కి వచ్చే అవకాశముంది. రేపు కృష్ణా-గోదావరి అనుసంధానంపై ఆంధ్రా, తెలంగాణ తగు రీతిలో ఒప్పందాలు చేసుకుంటాం. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇది అసాధ్యమేమీ కాదు.
సీఎం కేసీఆర్


గోదావరి-కృష్ణా అనుసంధానంపై చంద్రబాబునాయుడు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. నీటి పారుదలపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఎన్నో విమర్శలు చేశారని..కానీ ప్రపంచమంతా ఆ ప్రాజెక్టును పొగుడుతోందని చెప్పారు కేసీఆర్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజాప్రయోజనాల కోసం తమ పని తాము చేసుకుపోతామని స్పష్టంచేశారు తెలంగాణ సీఎం.
First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading