జగన్ బంధువుతో ఎస్పీ పెళ్లి.. హాజరైన సీఎం దంపతులు

చందనా దీప్తి వివాహానికి హాజరైన వైఎస్ జగన్ దంపతులు

వరుడు బలరాం రెడ్డి ఏపీ సీఎం జగన్ బంధువు. ఈ నేపథ్యంలో పెళ్లికి వెళ్లిన జగన్, ఆయన సతీమణి భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

  • Share this:
    హైదరాబాద్‌లో మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహ వేడుక వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె పెళ్లి చేసుకుంది. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో వీరి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చందనా దీప్తి-బలరాంరెడ్డి పెళ్లికి  ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎ కేసీఆర్  విడివిడిగా హాజరయ్యారు. వరుడు బలరాం రెడ్డి ఏపీ సీఎం జగన్ బంధువు. ఈ నేపథ్యంలో పెళ్లికి వెళ్లిన జగన్, ఆయన సతీమణి భారతి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్‌తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వివాహానికి హాజరయ్యారు.

    ఫొటోలు ఇక్కడ చూడండి:
    First published: