TELANGANA CM KCR ANNOUNCED PRC FOR GOVT EMPLOYEES IN ASSEMBLY HERE IS FULL DETAILS SK
Telangana: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బొనాంజ.. 30శాతం ఫిట్మెంట్తో పాటు ఇవీ వరాలు
సీఎం కేసీఆర్
ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మొత్తం 9.17 లక్షల మంది ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అందరూ అనుకున్న దాని కంటే ఒక శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇచ్చారు. మొత్తం 9.17 లక్షల మంది ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలోనే ప్రమోషన్లు వస్తాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
''ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీని ప్రకటిస్తున్నాం. కరోనాతో వేతన సవరణలో కొంత ఆలస్యం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్రపోషించారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో తన పేరు మార్చుకోలేదు. రాష్ట్రం కోసం ఎంతో పోరాడారు. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించింది. ఉద్యోగ సంఘాలతో నేను కూడా మాట్లాడాను. ఉద్యోగులంతా సంతృప్తి చెందేలా 30శాతం పీఆర్సీని ఇస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.'' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
విశ్రాంత ఉద్యోగులు పించన్ పొందే వయసు 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు.
ఎంప్లాయిష్ హెల్త్ స్కీమ్‌కు నూతన విధివిధానాల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
12 నెలల బకాయిలతో కలిపి ఉద్యోగులకు ఫిట్మెంట్ చెల్లింపు.
గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.16 లక్షలకు పెంపు
మొత్తం 9,17,799 మంది ఉద్యోగులకు ఫిట్మెంట్ధి. అర్హులలైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు.
రాష్ట్రంలో ఉన్న ఏపీ ఉద్యోగులు ఏపీకి వెళ్లేందుకు అనుమతి
కేజీవీబీల్లో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంపు
భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేందుకు వెసులుబాటు
సీపీఎస్ విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్
పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలు త్వరలోనే భర్తీ
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.