హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nikhat Zareen: శభాష్ నిఖత్... ఫోన్ చేసి అభినందించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Nikhat Zareen: శభాష్ నిఖత్... ఫోన్ చేసి అభినందించిన తెలంగాణ సీఎం కేసీఆర్

నిఖత్ జరీన్‌తో సీఎం కేసీఆర్

నిఖత్ జరీన్‌తో సీఎం కేసీఆర్

Nikhat Zareen Wins Gold Medal: మహిళల విభాగంలో జరిగిన బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) స్వర్ణ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్వర్ణ పతక పోరులో జరీన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మెక్ నౌల్ (నార్త్ ఐర్లాండ్)తో ఫైనల్లో జరీన్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ (Birmingham 2022 Commonwealth Games) క్రీడా పోటీల్లో, ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌తో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ‘బంగారు పతకాన్ని సాధించి భారత దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేశావు..’ అని నిఖత్ జరీన్ విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.

మహిళల విభాగంలో జరిగిన బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) స్వర్ణ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్వర్ణ పతక పోరులో జరీన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మెక్ నౌల్ (నార్త్ ఐర్లాండ్)తో ఫైనల్లో జరీన్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. బాక్సింగ్‌లో భారత్ అదరగొడుతోంది. ఇవాళ ఒకేరోజు భారత్‌కు మూడు బంగారు పతకాలను సాధించింది.

మూడు రౌండ్ల పాటు జరిగిన ఫైనల్ పోరులో నిఖత్ జరీన్ ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. నిఖత్ జరీన్ పంచ్‌లకు మెక్ నౌల్ కంటికి గాయం కూడా అయ్యింది. ఏ దశలోనూ ఆమె నిఖత్ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది. ఇటీవలె నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో చాంపియన్ గా నిలిచింది కూడా. అదే దూకుడును ఇక్కడ కూడా ప్రదర్శించింది. హాట్ ఫేవరెట్ గా ఈ మెగా ఈవెంట్ లో అడుగుపెట్టిన నిఖత్ జరీన్ అంచనాలకు మించి రాణించింది.

నిఖత్ జరీన్ ప్రస్తుతం అనుభవిస్తున్న సక్సెస్ అంత సులభంగా ఏమీ రాలేదు. ప్రతిభ ఉన్నా.. తాను ఎంచుకున్న కేటగిరీలో అప్పటికే భారత్ కు మేరీకామ్ లాంటి దిగ్గజం ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆరంభంలో నిఖత్ కు అవకాశాలు రాలేదు. మేరీ కామ్ వల్ల ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు దూరమైంది. అయితే మేరీ కామ్ పక్కకు తప్పుకోవడంతో ఈ ఏడాది నుంచి నిఖత్ 50 కేజీల విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఈ క్రమంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలవడంతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఆడుతూనే ఏకంగా  స్వర్ణ పతకం సాధించింది.

First published:

Tags: CM KCR, Nikhat Zareen, Nizamabad, Telangana