• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA CM K CHANDRASHEKAR RAO SUGGESTIONS TO GHMC MAYOR AND CORPORATERS REGARDING HYDERABAD ISSUES AK

CM KCR-GHMC MAYOR: ఆ పాట వినండి.. వారి కష్టాలు తీర్చండి.. జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గానికి సీఎం కేసీఆర్ సూచన

CM KCR-GHMC MAYOR: ఆ పాట వినండి.. వారి కష్టాలు తీర్చండి.. జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గానికి సీఎం కేసీఆర్ సూచన

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

CM KCR-GHMC MAYOR: ఇంత మంది కార్పొరేటర్లున్నా కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుందని.. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారని కేసీఆర్ వారితో అన్నారు. కానీ అందరికీ ఆ పదవి ఇవ్వలేమని... నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరని అన్నారు.

  • Share this:
    విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్తవ్యబోధ చేశారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దని... వేష, భాషల్లో మార్పులు రావద్దని అన్నారు.

    అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినాలని కేసీఆర్ వారికి తెలిపారు. ఆ పాట తాను వంద సార్లు విన్నానని... అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయని... వాటిని అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలని.. బస్తీ సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యం కావాలని కేసీఆర్ అన్నారు.

    జీహెచ్ఎంసీ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మీ


    హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయని... మంచి భవిష్యత్ ఉన్నదని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుందని.. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం హైదరాబాద్ అని గుర్తు చేశారు. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నదని... అందరూ గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని.. వాటికి సహకరించాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఇంత మంది కార్పొరేటర్లున్నా కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుందని.. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారని కేసీఆర్ వారితో అన్నారు. కానీ అందరికీ ఆ పదవి ఇవ్వలేమని... నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు