news18-telugu
Updated: January 7, 2021, 4:25 PM IST
కేసీఆర్ (ఫైల్ ఫొటో)
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మరికాసేపట్లో సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. సీఎం కేసీఆర్కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఎంఆర్ఐ, సిటి స్కాన్ వంటి పరీక్షలు అవసరం కావడంతో.. వాటి కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లనున్నారు.
ఉదయం తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై హిమా కొహ్లితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
January 7, 2021, 1:54 PM IST