• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TELANGANA CM FRIEND AKULA AGAVVA HOSPITALIZED AFTER EATING CM KCR MEETING IN VASALAMARRI SK

Telangana: సీఎం కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు అస్వస్థత.. వాసాలమర్రిలో ఆరోజు ఏం జరిగిందంటే..

సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం చేస్తున్న ఆకుల ఆగవ్వ

జూన్ 22న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో పర్యటించి గ్రామస్తులకు విందు ఇచ్చారు. విందులో సీఎం పక్కనే పక్కనే ఆకుల ఆగవ్వతో పాటు లక్ష్మి కూర్చొని భోజనం చేశారు. భోజనం తర్వాత ఆగవ్వకు నేరేండు పండ్లు కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్.

  • Share this:
    తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) వాసాలమర్రి సభలో ఓ వృద్ధురాలు హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమే ఆకుల ఆగవ్వ. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చొని ఆమె భోజనం చేశారు. అన్నం తింటూ ఆమెతో కాసేపు ముచ్చటించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆకుల ఆగవ్వ తనకు మంచి దోస్తయిందని చెప్పారు. ఐతే ఆ వృద్ధురాలు అస్వస్థతకు గురయ్యారు. వాసాలమర్రిలో సీఎం సభ ముగిసిన వెంటనే వాంతులు చేసుకున్నారు. అనంతరం జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన తుర్కపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీపీ ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక రోజు చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జి అయ్యారు. తిరిగి వాసాలమర్రికి చేరుకున్న ఆగవ్వ.. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.

    జూన్ 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఊరి ప్రజలందరికీ విందు ఇచ్చారు. సీఎం కేసీఆర్ పక్కనే ఆకుల ఆగవ్వతో పాటు లక్ష్మి కూర్చొని భోజనం చేశారు. భోజనం తర్వాత ఆగవ్వకు నేరేండు పండ్లు కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్. గ్రామ ప్రజలను అడిగి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాసాలమర్రిని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రసంగ సమయంలో ఆకుల ఆగవ్వ గురించి మాట్లాడారు సీఎం కేసీఆర్. వాసాల మర్రి గ్రామంలో ఆకుల ఆగవ్వకు తనకు మంచి దోప్తు అయిందని సీఎం కేసీఆర్ ఆ రోజు చెప్పారు. ఇప్పటి వరకు ఊరిలో నలుగురు మాత్రమే పరిచమయ్యారని.. వారు సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్, ఆకుల ఆగవ్వ, లక్ష్మి అని చెప్పారు. ఆకుల ఆగవవ్వ తనకు దోస్తయిందని సీఎం కేసీఆర్ అనగానే.. గ్రామస్తులంతా నవ్వారు. 'ఏమైంది.. ఆగవ్వ నా దోస్తి పట్టొద్దా..'' అని చమత్కరించారు సీఎం కేసీఆర్. ఈ గ్రామంలో మిగతా వారంతా తనకు పరిచయం కావాల్సి ఉందని అన్నారు. ఈ ఊరికి ఇంకో 20 సార్లైన వస్తానని ఆయన తెలిపారు.

    సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన, సహపంక్తి భోజనాల కోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చయినట్లు తెలిసింది. ఆ రోజు విందులో 23 రకాల వంటకాలను వడ్డించారు. మేక మాంసం, కోడి మాంసం, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, పప్పు, పచ్చి పులుసు, పాలక్‌ పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, చట్నీలు, చల్లచారు, రెండు రకాల స్వీట్లతో పసందైన విందు ఇచ్చారు. ఐతే ఆ విందులో దాదాపు 2500 మంది పాల్గొన్నారు. ఐతే విందు అనంతరం ఆగవ్వతో పాటు మరో 40 మంది స్వల్ప అస్వస్థతకు గురయినట్లు స్థానికులు చెప్పారు. కాగా, వాసాలమర్రిని అంకాపూర్ తరహాలో ఆదర్శగ్రామంగా తీర్చి దిద్దుతానని మాటిచ్చారు సీఎం కేసీఆర్. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. రూ.150 కోట్లు అవసరమైనా ఖర్చు చేసేంందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: