హోమ్ /వార్తలు /తెలంగాణ /

Farmer Pension Scheme: రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

Farmer Pension Scheme: రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

రైతుల కోసం సరికొత్త పథకం ప్రారంభించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు పింఛన్‌ స్కీంను అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం.

  రైతుల కోసం సరికొత్త పథకం ప్రారంభించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana Chief minister KCR)​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు పింఛన్‌ స్కీం (Farmer Pension Scheme) ను అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ (Finance department) ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ మాట్లాడుతూ.. త్వరలో రైతులకు గుడ్‌ న్యూస్‌ (Good news to Farmers) చెప్తానని అన్నారు. గతంలో ఇచ్చిన రైతులకు పింఛన్‌ స్కీం (pension scheme) హామీని అమలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందట. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు (raithu bandhu), రైతుబీమా (raithu bheema) పథకాలతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటోంది. వీటికి తోడు అన్నదాతల కోసం ఈ ఫించన్ స్కీం ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని టాక్​.

  47 ఏళ్లు లేదా 49..

  ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు పథకం (raithu bandhu) లబ్దిదారులు 67 లక్షల మంది ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తి వివరాలను (Full details) సేకరిస్తున్నట్లు సమాచారం. రైతుల కోసం పింఛన్‌ స్కీం (Pension scheme) కోసం విధివిధానాలు రూపొందించే పనిలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఫుల్ బిజీగా ఉంది . ఈ పథకానికి 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. వీరికి రూ.2,016 పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

  రైతు బంధుపై ఆరా..

  రైతుబంధు పథకం లబ్దిదారులైన రైతులలో ఎంతమందికి భూమి (land) ఉందని విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మూడు నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్ని వివరాలను పొందు పరుస్తూ ఓ సమగ్ర వేదికను అధికారులు తయారుచేస్తున్నారు. అంతేకాదు.. అన్నదాతకు ఈ పథాన్ని అమలు చేస్తే.. ఖజానా పై ఎంత భారం పడనున్నది అనే విషయంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్​ విమర్శలు గుప్పించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిర్ధారణ అయిందని సీఎం స్పష్టం చేశారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం... ఎన్ఆర్జీఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం దుర్మార్గమని కేసీఆర్​ మండిపడ్డారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం ...వెనక కుట్ర దాగి వుందన్నారు.

  First published:

  Tags: CM KCR, Farmers, Pension Scheme, Telangana

  ఉత్తమ కథలు