హోమ్ /వార్తలు /telangana /

Sankranti wishes: సంక్రాంతి పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావుల సందేశం.. ఏమన్నారంటే..

Sankranti wishes: సంక్రాంతి పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావుల సందేశం.. ఏమన్నారంటే..

కరోనా ఉధృతిలో  కూడా తెలుగు ప్రజలు బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగను స్వాగతించారు. ఏ ఇంట చూసినా సంక్రాంతి శోభ దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్​, మంత్రి హరీశ్​ రావులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

    సంక్రాంతి (Sankranti) పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా పండుగ (Festival) వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతిలో  కూడా తెలుగు ప్రజలు బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి పండుగను స్వాగతించారు. ఏ ఇంట చూసినా సంక్రాంతి శోభ దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (Telangana CM K Chandrashekar Rao), మంత్రి హరీశ్​ రావు (Minister harish rao)లు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వేరువేరు ప్రకటనలు విడుదల చేశారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి  కేసీఆర్ (KCR)​ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సిఎం అన్నారు.

    ఎన్ని కష్టాలెదురైనా..

    దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ (Telangana)లో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు ​. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను (Sankranti Festival) పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.

     సకల సంపదలతో..

    సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీష్ రావు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ (Harish)​ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లోనే వారు ప్రజల కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని కోరుకుంటున్నానని హరీశ్​ చెప్పారు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. భోగి అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని, సంక్రాంతి ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలని, కనుమ పండుగ కనువిందుగా జరుపుకోవాలని భగవంతుడిని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నారు.

    సంక్రాంతి పండుగను కరోనా నిబంధనలు , జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి ఇంటివద్ద వారే చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు రెండు డోస్ టీకాలు వేసుకోవాలని . రెండు టీకాలు వేసుకున్న 60 ఏళ్ల వయస్సు వారు బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. మాస్క్ ధరించాలని సూంచించారు మంత్రి. భౌతిక దూరం పాటించాలని హరీశ్​ అందరికీ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని హరీశ్​ తెలిపారు.

    First published:

    ఉత్తమ కథలు