TELANGANA CHIEF MINISTER CHANDRASEKHARA RAO PHONED MEGASTAR CHIRANJEEVI AND ASKED CHIRU HEALTH CONDITION PRV
CM KCR phone to Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్.. చిరు ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా..
చిరంజీవి, కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇక ఆయనకు ఇరు రాష్ట్రాల సీఎంలతో సఖ్యత బాగానే ఉంది. ఇదే సమయంలో గురువారం మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫోన్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫోన్ (CM KCR) చేశారు. కరోనా బారిన పడ్డ చిరంజీవిని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడా కేసీఆర్ (KCR) మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి (To the Government of Telangana), సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉన్న చిరంజీవి అనేకసార్లు ముఖ్యమంత్రిని కలిశారు. సినీ పరిశ్రమకు (Cine Industry) సంబంధించి అనేక అంశాలు, సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం విషయంలో కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు. కాగా, తాను కరోనా బారిన పడినట్లు నిన్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి (CM KCR phone to Megastar Chiranjeevi) పరామర్శించడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే చిరంజీవి మరోసారి కరోనా (Corona0 బారిన పడిన విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్వీట్ ద్వారా ఆయన త్వరిగతగిన కోలుకుంటారని చెప్పుకొచ్చారు.
Dear All,
Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.
I request all who came in contact with me over the last few days to get tested too.
సినీ పరిశ్రమ - ప్రభుత్వాల మధ్య చిరంజీవి ఇటు తెలంగాణ - అటు ఏపీ ప్రభుత్వాలతో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ కేసీఆర్ తోనూ చిరంజీవి సినీ ప్రముఖలతో కలిసి సమావేశమయ్యారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు ఏ రకమైన సమస్యలు ఉన్నాయి.. ఏం కావాలో వివరించారు.ఆ సమయంలో కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది.
జగన్తో ఇటీవలె సమావేశం..
ఏపీ ప్రభుత్వంతో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం పైన వివాదం సాగుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి అమరావతి వెళ్లి జగన్ తో సమావేశమయ్యారు. ఇద్దరూ లంచ్ మీటింగ్ లో సినీ ఇండస్ట్రీ సమస్యల పైన చర్చ చేసారు. ఆ తరువాత తాను సీఎం ఆహ్వానం మేరకే వచ్చానని చెబుతూ..సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని...త్వరలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత మరోసారి కలిసి... తుది డ్రాఫ్ట్ సిద్దం చేద్దామని చెప్పారని చిరంజీవి వివరించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.