ఆర్టీసీ భవితవ్యం తేలేది నేడే.. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ..

TSRTC : ఆర్టీసీపై అన్ని ప్రశ్నలకు ఈ రోజు సమాధానం లభించనుంది. నేడు, రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకోన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: November 28, 2019, 6:37 AM IST
ఆర్టీసీ భవితవ్యం తేలేది నేడే.. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందా? తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా కొత్త పద్ధతికి సీఎం కేసీఆర్ నాంది పలకబోతున్నారా? లేక సమ్మె విరమించి విధుల్లో చేరతామంటున్న వారిని తీసుకుంటారా? నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడాలంటే ప్రైవేటీకరణతో సాధ్యమంటున్న ముఖ్యమంత్రి అడుగులు ఏంటి? అంటే ఈ అన్ని ప్రశ్నలకు ఈ రోజు సమాధానం లభించనుంది. నేడు, రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకోన్నట్లు సమాచారం. ఆర్టీసీ ప్రధాన అంశమే అజెండాగా జరగనున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దూకుడుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 5100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేంద్ర రవాణా చట్టం, హైకోర్టు ప్రైవేటీకరణకు అడ్డు చెప్పకపోవడంతో మంత్రివర్గం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీఆర్‌ఎస్‌ను దాదాపు 20 వేల మంది కార్మికులకు ఆఫర్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటు చేతికి అందిస్తే సంస్థకు సగం మంది కార్మికులు మాత్రమే అవసరం అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48 వేల మంది కార్మికులు ఉన్నారు. అందులో 24 వేల మంది మాత్రమే కావాల్సిన నేపథ్యంలో వీఆర్‌ఎస్ ఆఫర్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. రెండు రోజుల పాటు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపైనా చర్చలు జరిపే అవకాశం ఉంది. వయోపరిమితి, వేతన సవరణపై నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. అటు.. హైకోర్టు ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త పేరుతో దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 28, 2019, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading