Telangana: మంత్రివర్యా.. ఎంత ఘాటు ప్రేమయో..!

ఆయనొక మంత్రి.. తెలంగాణ క్యాబినెట్ లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాల ఖిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సదరు మంత్రివర్యులు.. లేటు వయసులో ఘాటు ప్రేమాయణం నడుపుతున్నట్టు స్థానిక మీడియాలో పుంఖానుపుంఖానుగా కథనాలు వస్తున్నాయి.

news18
Updated: October 29, 2020, 10:04 AM IST
Telangana: మంత్రివర్యా.. ఎంత ఘాటు ప్రేమయో..!
  • News18
  • Last Updated: October 29, 2020, 10:04 AM IST
  • Share this:
ఆయనొక మంత్రి.. తెలంగాణ క్యాబినెట్ లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాల ఖిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సదరు మంత్రివర్యులు.. లేటు వయసులో ఘాటు ప్రేమాయణం నడుపుతున్నారు. ఈ మేరకు స్థానిక మీడియాలో పుంఖానుపుంఖానుగా కథనాలు వస్తున్నాయి. సదరు మంత్రిగారు.. ప్రియురాలి కోసం తపించిపోతున్నారట.. ‘నీవు లేక నేను లేను’.. ‘నూవే నా ప్రాణం’.. ‘మనసంతా నువ్వే..’ అంటూ విరహగీతాలు పాడుకుంటున్నారట. ప్రియురాలి కోసం నిద్రాహారాలు మాని.. కీలక ఫైల్స్ అన్నింటినీ పక్కనపెట్టి మరీ ప్రేమలోకంలో తేలియాడిపోతున్నారట.

సదరు మంత్రి గారికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినా కాంతదాసుడయ్యారా మంత్రి.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటే.. తనకు ఫుల్ బాడీ మసాజ్ కావాలని మనసులోని కోరికను ఆ మంత్రి బయటపెట్టేదాకా వెళ్లింది. ఇంకేం.. ఆ యువతి కూడా.. ‘మీలాంటి వీఐపీ దొరకడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం.. మీ పాదాల  దగ్గర ఇంత చోటిస్తే చాలు.. మీ వెంటే నేను’ అంటూ ఊహల లోకంలో మునిగితేలిపోతుంది. ఆమెను మరింతలా వశపరుచుకోవడం కోసం సోషల్ మీడియా మాధ్యమాలైన వాట్సాప్ చాట్ లు, ఫేస్బుక్ మెసేంజర్ లలో ‘గిఫ్ట్’లు, ఇన్స్టాగ్రాంలలో ఫోటోలు.. అబ్బో.. వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఆ భగ్న ప్రేమికురాలు.. మంత్రి గారి ఫోన్ నెంబర్ ను ఏకంగా ‘హబ్బీ’ అని ఫీడ్ చేసుకుందంటే వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత.

వారిరువురు ఎంత దగ్గరయ్యారో తెలుసుకోవాలంటే సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఆ చాటింగ్ క్లిప్స్ ను చూస్తేనే అర్థమవుతున్నది. కాగా, ఆ ప్రేమికురాలు తనకు డబ్బులు అవసరముందని అడగ్గానే.. మన మినిస్టర్ గారు ఆమెకు ఆపన్నహస్తమందించాడు. ఈ క్రమంలో ఆమె తనకు ప్రియుడు పంపిన డబ్బుల రశీదును ‘చాలా భద్రంగా’ దాచుకుంది. మంత్రిగారికి మనసేం భాగోలేనప్పుడు.. ‘అబ్బ.. ఒకసారి కలవవా...’ అనగానే.. ‘మీరు అడగాలా...? మీరు అడిగితే అగ్గిలో దూకమన్నా దూకనూ..’ అంటూ ఆమె బదులిచ్చింది. ఇదేం మా సొంత కవిత్వం కాదండోయ్.. వారిరువురు చాటింగ్ లో చెప్పుకున్న ఊసులే.

ఈ స్క్రీన్ షాట్లే ఇప్పుడు కొంపముంచుతున్నాయి. ఎలా లీకయ్యాయో.. ఏమో గానీ ఇవి ఫేస్బుక్ లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఇద్దరి మధ్య సఖ్యత లోపించడం కారణంగానే.. ఈ చాటింగ్ విషయాలు బహిర్గతమయ్యాయని ఆ పుర ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో మంత్రి గారి వీరాభిమాని ఒకడు ఉన్నట్టు తెలుస్తుంది. ‘అన్న కోసం ప్రాణాలిచ్చే లక్ష్మణుడు నేను’ అన్నంత వీర లెవల్ లో ఆ తమ్ముడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంత్రి గారి కాళ్లకింద భూమి కదులుతున్నది.

అయితే ఈ వ్యవహారం ఎటు వెళ్లి ఎక్కడికి దారితీస్తుందిరో దేవుడో..? అంటూ సదరు మంత్రి గారు తల పట్టుకుంటున్నారు. ఇది ఆ నగరం దాటికి బయటకు రాకముందే.. దీన్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్త హైదరాబాద్ చేరేలోపే అక్కడే తుంచేస్తారా..? లేక తెలిస్తే మంత్రి పదవి ఊడనుందా..? అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Published by: Srinivas Munigala
First published: October 29, 2020, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading