• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TELANGANA CABINET MEETING WILL BE HELD ON SATURDAY OFTERNOON VRY HYD

Cabinet meeting : రేపు అత్యవసర కేబినెట్ సమావేశం..లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Cabinet meeting : ఈ నెల 19వ తేదీన అనగా శనివారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. రేప‌టితో లాక్‌డౌన్ ముగియ‌నున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై కేబినెట్ భవిష్యత్ కార్యచరణపై నిర్ణ‌యం తీసుకోనుంది.

  • Share this:
ఈ నెల 19వ తేదీన అనగా శనివారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. రేప‌టితో లాక్‌డౌన్ ముగియ‌నున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై కేబినెట్ భవిష్యత్ కార్యచరణపై నిర్ణ‌యం తీసుకోనుంది. దీంతో పాటు సీజ‌న‌ల్ వ్యాధులు, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావ‌రిలో నీటి ఎత్తిపోత‌, హైడల్ పవర్ ఉత్ప‌త్తితో పాటు పలు అంశాలను కూడా చ‌ర్చించ‌నున్నారు.



ముఖ్యంగా లాక్‌డౌన్ నిబంధనలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. రేపటి వరకు సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపులు ఉండగా..ఆదివారం నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి..కాగా ఉదయం ఆరు నుండి రాత్రి పదిగంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నారు. అంటే ఇక రాత్రీ పూట మాత్రమే నిబంధనలను కట్టుదిట్టం చేయనున్నారు.  దీంతో పాటు వ్యవసాయ సంబంధమైన అంశాలపై ప్రధాన చర్చ కొనసాగనుంది.
Published by:yveerash yveerash
First published: