Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: వీటితో పాటు దళిత బీమా, చేనేత బీమా పథకాలపై కూడా తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Share this:
    తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఎల్లుండి జరగనుంది. ఆగస్టు 1న మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకంపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు దళిత బీమా, చేనేత బీమా పథకాలపై కూడా తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు పంటల సాగు, ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగొచ్చని తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: