• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA CABINET MEETING STARTED WILL DISCUSS AND DECIDE ON IMPOSING LOCKDOWN IN STATE AK

Lockdown In Telangana: తెలంగాణలో 10 రోజుల లాక్‌డౌన్.. రేపటి నుంచే.. కేబినెట్ కీలక నిర్ణయం...

Lockdown In Telangana: తెలంగాణలో 10 రోజుల లాక్‌డౌన్.. రేపటి నుంచే.. కేబినెట్ కీలక నిర్ణయం...

సీఎం కేసీఆర్

Lockdown in Telangana: ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశంపై అత్యవసరంగా సమావేశమైన మంత్రివర్గం సమావేశం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే దానిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లతో ఇతర అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై చర్చిస్తోంది. ఈ సమస్యను ఏ రకంగా అధిగమించాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇక తెలంగాణలో లాక్‌డౌన్ విధించినట్టు ప్రభుత్వం హైకోర్టుకు వివరించనుంది.

    అంతకుముందు తెలంగాణలో కరోనా పరిస్థితి, కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదని హైకోర్టు సీరియస్ అయింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించింది. అంబులెన్స్ లను అడ్డుకోవడంపై వివరాలు కోరిన హైకోర్టు..పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. ఇవాళ 2.30కి లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై కెబినెట్ నిర్ణయం తెలియస్తామని ఏజీ సమాధానం ఇచ్చారు.రంజాన్ అయిపోయిన తర్వాత లాక్ డౌన్ పెడదాము అనుకుంటున్నారా..? ఈలోగా కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో మీకు తెలుసా అని ప్రశ్నించింది హైకోర్టు. అయితే లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. ఇదే విషయాన్ని ఏజీ ద్వారా హైకోర్టుకు వివరించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు