TELANGANA CABINET MEETING STARTED PRESIDED BY CM KCR VRY
Cabinet Meeting : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం..యాసంగి పంటలపై కీలక నిర్ణయం
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
Telangana cabinet : సీఎం కేసిఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ( Telangana Cabinet Meeting )మంత్రులతోపాటు సీఎస్ ఇతర అధికారులు పాల్గోన్నారు..కాగా వరి ధాన్యం కొనుగొళ్లు, యాసంగిలో పంటమార్పితో పాటు కరోనాపై ముందు జాగ్రత్త చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీఎం కేసిఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు..గత కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చితి పరిస్థితి, రైతాంగం సమస్యలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. ( Telangana Cabinet Meeting ) ఈక్రమంలోనే ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా చేపట్టే కార్యచరణకు ఆమోద ముద్ర లభించనుంది. దీంతో పాటు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ఖరాఖండిగా చెప్పడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించే విధంగా నిర్ణయాలు చేపట్టనున్నారు.
ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ( Telangana Cabinet Meeting ) విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ( Telangana Cabinet Meeting )దీంతో పాటు కేంద్ర వైఖరిపై తీసుకోబోయో అంశాలపై కూడా మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించి దాని కార్యచరణపై ప్రకటించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రైతుల పంట విధానం, యాసంగిలో వేయాల్సిన పంటలపై కూడా క్షుణ్ణంగా చర్చించనున్నట్టు సమాచారం.
మరోవైపు ఇటివల ఆర్టీసీ చార్జీల పెంపు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పర్యటన పరిణామాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ల ఉదృతి, దాని పరిణాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ,వైద్యశాఖతో పాటు పలు శాఖలు చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన ఆంక్షలు, ఇతర అంశాలపై కూడా చర్చించి చేపట్టే చర్యలను కేబినెట్ ముందు ఉంచనున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.