Cabinet meeting :ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం..ఉద్యోగాలపై క్లారిటి

Cabinet meeting :ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం..ఉద్యోగాలపై క్లారిటి

Cabinet meeting : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక భేటి అయింది..ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి అమోదముద్ర వేయనున్నారు.ముఖ్యంగా 50వేల ఉద్యోగాల భర్తీ, భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై ప్రధానమైన చర్చ జరగనుంది.

 • Share this:
  ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. హుజురాబాద్ ఉప ఎన్నికలతోపాటు , ఉద్యోగాలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళన చేస్తుండడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని ఆందోళనలను దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ 50వేల ఉద్యోగాల భర్తిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంభంధించిన ఖాలీలను మంత్రిమండలి ముందు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత నాలుగు రోజులుగా ఉద్యోగ ఖాలీలపై కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను ఖారరు చేసి,మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.

  మరో కీలక అంశం భూములు రిజిస్ట్రేషన్ విలువను పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. కరోనా నేపథ్యంలోనే సుమారు లక్ష కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ఇందుకోసం భూముల విలువను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..ఇందుకు అనుగుణంగా భూముల విలువ పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ శాతాన్ని కూడా పెంచేందుకు మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సమావేశంలో రిజిస్ట్రేషన్‌తో పాటు భూముల విలువలు ఏమేరకు పెంచాలనే దానిపై నేడు సీఎం ప్రకటించి నిర్ణయం తీసుకోనున్నారు.

  దీంతో పాటు క‌ృష్ణానదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌తో ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా నీటి వివాదంపై సీఎం కేసిఆర్‌కు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అధికారం కూడా మంత్రి మండలి చర్చించనుంది. కాగా ఇప్పటికే..న్యాయపోరాటంతోపాటు చుక్కు నీరు కూడా వదిలిపెట్టుకోమని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు.

  పై అంశాలతో పాటు ప్రస్తుత కరోనా పరిస్థితులు, గత పదిరోజులుగా జరిగిన పల్లె,పట్టణ ప్రగతి అభివృద్దిపై సమీక్షంచనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఆయా ప్రభుత్వ శాఖల భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేయనున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలు, వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది.

  కాగా రాష్ట్ర కేబినెట్ కంటే ముందే తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు , అందుకు అనుగుణంగా వెంటనే 50 వేల నూతన ఉద్యోగాల భర్తీ చేపట్టడం పట్ల., ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కు  కృతజ్జతలు తెలియ చేశారు.
  Published by:yveerash yveerash
  First published: