ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికే పలు నిబంధనలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు రానున్న ఫెస్టివల్స్ సంధర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫంక్షన్లు, సినిమాల హాళ్లు, ఫంక్షన్ హళ్లలపై మరోసారి ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు మంత్రి హరీష్ రావు మంత్రిమండలికి నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికేసులతో పాటు తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించినట్టు సమాచారం. ఇక కరోనా ఉదృతి అవుతున్న పరిస్థితుల్లో చికిత్స కోసం తీసుకోవాల్సిన అంశాలను ఆయన వివించినట్టు తెలుస్తోంది. కాగా పూర్తి స్థాయి నిర్ణయాలు కోవిడ్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..
కాగా మరోవైపు కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో వాదనలు జరిగాయి.. ఈ సంధర్భంలో హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సంధర్భంలోనే కరోనా టెస్టులు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రోజుకు లక్ష వరకు కరోనా టెస్టులు చేయలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ , ర్యాపిడ్ పరీక్షల టెస్టులను రోజు వారిగా వేర్వేరు నివేదికలు ఇవ్వాలని కోరింది. దీంతో కరోనాపై తీసుకోబోయో చర్యలపై కేబినెట్లో చర్చించి పూర్తి నివేదిక అందిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Corona alert, Telangana