Home /News /telangana /

TELANGANA CABINET MEETING ON MONDAY PRESIDED BY CM KCR VRY

Cabinet Meeting : సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ధాన్యం..ఇతర అంశాలపై చర్చ

సీఎం కేసీఆర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ (ఫైల్)

Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంకానుంది.

    సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనుంది. ( Telangana Cabinet Meeting )దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ( Telangana Cabinet Meeting )ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. దీంతో పాటు కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

    గత కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చితి పరిస్థితి, రైతాంగం సమస్యలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ( Telangana Cabinet Meeting ) విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్రం ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టే విధంగా పలు అంశాలపై చర్చించనున్నారు. ( Telangana Cabinet Meeting )దీంతో పాటు కేంద్ర వైఖరిపై తీసుకోబోయో అంశాలపై కూడా మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించి దాని కార్యచరణపై ప్రకటించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రైతుల పంట విధానం, యాసంగిలో వేయాల్సిన పంటలపై కూడా క్షుణ్ణంగా చర్చించనున్నట్టు సమాచారం.

    MLC Kavita : అప్పుడు కేటీఆర్‌కు ..ఇప్పుడు కవితకు లేఖలు..


    మరోవైపు ఇటివల ఆర్టీసీ చార్జీల పెంపు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పర్యటన పరిణామాలను కూడా వివరించనున్నట్లు సమాచారం. ( Telangana Cabinet Meeting )ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయిన సీఎం, పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి దిశానిర్ధేశం చేశారు. కేంద్రంపై మెతక వైఖరీ వీడి ఇక రాష్ట్ర డిమాండ్‌లను సాధించడంతో నిమగ్నం కావాలని ఎంపీలకు సూచించారు..

    Hyderabad : మద్యం మత్తులో తండ్రి కర్కశం.. పిల్లాడిని కిందపడేసి దారుణం


    ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ల ఉదృతి, దాని పరిణాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ,వైద్యశాఖతో పాటు పలు శాఖలు చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన ఆంక్షలు, ఇతర అంశాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Telangana cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు