Home /News /telangana /

TELANGANA CABINET MEETING ON MAY 30 CM KCR TO ANNOUNCE KEY DECISIONS ON LOCKDOWN SK

Telangana: మే 30న తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ను సీఎం కేసీఆర్ పొడిగిస్తారా?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా పరిస్థితి, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వ్యవసాయంతో పాటు కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు.

    ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు.మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఏంటి? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గాయని సడలింపులు ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఐతే దీనిపై మే 30న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది.

    రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా పరిస్థితి, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వ్యవసాయంతో పాటు కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా పంటలన కోశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. ఐతే చాలా చోట్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని సంబంధిత మంత్రులు, అధికారులను ఆరాతీయనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు, ఎరువుల లభ్యత గురించి కూడా చర్చిస్తారు.

    రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపైనా కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. గతంలో 10వేలకు పైగా నమోదైన రోజూవారీ కరోనా కేసులు.. ఇప్పుడు 4వేల లోపే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 30వ లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇంకా ఏం చేయాలో మంత్రులు చర్చించనున్నారు. అనంతరం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఐే లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సడలింపులు ఇస్తే.. జనం విచ్చల విడిగా రోడ్ల మీదకు వస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మళ్లీ కరోనా విజృంభింవచ్చని.. అందుకే మరికొన్నాళ్లు ఇదే పరిస్థితిని కొనసాగించవచ్చని తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Corona lockdown, Coronavirus, Covid-19, Lockdown, Telangana

    తదుపరి వార్తలు