T Cabinet : నేటి సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ... ఏం చర్చిస్తారంటే...

Telangana Cabinet Meet : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ మీట్ ఎందుకు పెడుతున్నారు? అంతగా చర్చించాల్సిన అంశాలు ఏమున్నాయి? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు?

news18-telugu
Updated: February 16, 2020, 6:10 AM IST
T Cabinet : నేటి సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ... ఏం చర్చిస్తారంటే...
T Cabinet : నేటి సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ... ఏం చర్చిస్తారంటే...
  • Share this:
Telangana Cabinet Meet : ఆదివారం సాయంత్రం 4 గంటలు ఎప్పుడవుతుందా అని తెలంగాణ మంత్రులంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే... ఆ సమయంలో కేబినెట్ మీటింగ్ ప్రగతిభవన్‌లో జరగబోతోంది. సీఎం కేసీఆర్... తెలంగాణ ప్రధాన కార్యదర్శి (T CS) సోమేశ్ కుమార్‌కు ఆదేశాలివ్వగానే మంత్రులందరూ మానసికంగా సమావేశానికి సిద్ధమైపోయారు. ఈసారి కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైనది. ఎందుకంటే... త్వరలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌పై ఇవాళ్టి చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలో డేట్ ఫిక్స్ చేసే ఛాన్సుంది. ఓ అంచనా ప్రకారం... మార్చి మొదటి వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) జరుగుతాయి. అలాగే సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చెయ్యాలనుకుంటున్నారు కదా. అందువల్ల అందుకు సంబంధించిన కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో చర్చించే వీలుంది. అంతే కాదు... మొన్న కాళేశ్వరంకి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే... తెలంగాణలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా చేయాలని సంకల్పించారు. అలా ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి అన్నది ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. ఈమధ్య గల్ఫ్ దేశాలు సహా విదేశాలకు వెళ్తున్నవారు ఇబ్బంది పడుతున్నారు కదా. దీనిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే చాలాసార్లు స్పందించారు. ఇదే అంశంపై ఎలా ముందుకెళ్లాలో ఇవాళ్టి కేబినెట్ మీట్‌లో చర్చించే అవకాశం ఉంది. అలాగే సీఏఏ (CAA)కి వ్యతిరేకంగా అసెంబ్లీలో చేయబోయే తీర్మానంపై కూడా చర్చించే ఛాన్సుంది. అలాగే మున్సిపల్ చట్టం, అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, పట్టణ ప్రగతి కార్యక్రమం, కేంద్రంతో సంబంధాలపైనా చర్చించే వీలుంది.

ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. కేంద్రం నుంచీ వచ్చే నిధులు కూడా తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో బడ్జెట్ రూపకల్పన పెద్ద సమస్యగా మారింది. అమలవుతున్న హామీలకు చాలా నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కేబినెట్ మీట్‌లో కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్ని మరింత విస్తరిస్తూ... శాటిలైట్ సిటీలను నిర్మిస్తారని తెలుస్తోంది. అందుకు ఎలాంటి ప్లాన్ రెడీ అవుతోందో, తద్వారా ఎలా నిధుల సేకరణ సాధ్యమవుతుందో కేసీఆర్ ఇవాళ్టి మీటింగ్‌లో వివరించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉంది.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు