తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో చాలాకాలం నుంచి పెండింగ్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాబోయే 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగా పెన్షన్లతో పాటు రేషన్ కార్డులను జారీ చేయడం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రజలకు రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ration cards, Telangana