Home /News /telangana /

Telangana Cabinet: ‘ఒమిక్రాన్‌’పై తెలంగాణ కేబినెట్‌లో చర్చ.. ఆ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశాలు

Telangana Cabinet: ‘ఒమిక్రాన్‌’పై తెలంగాణ కేబినెట్‌లో చర్చ.. ఆ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Cabinet: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం ఆదేశించారు.

  కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీలో ముందుగా ప్రజారోగ్యంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత,అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాల పై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది.అదే సందర్భంలో, కరోనా నుంచి ఒమిక్రాన్’’ పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్‌కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని తెలిపారు. నివేదిక సమర్పించారు.

  గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.

  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా టీకా ప్రక్రియను సమీక్షించి.. అదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది.

  Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

  KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

  Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

  Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

  క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికైతే ఎక్కువ కేసులు రాలేదు కానీ వేగంగా వ్యాప్తి చేందే ఈ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి. . ఇది B.1.1.529 అనే వంశానికి చెందిన సంబంధిత SARS CoV 2 వైరస్‌ల సమూహాన్ని గుర్తించింది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలుసుకోండి.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Omicron corona variant, Telangana, Telangana cabinet

  తదుపరి వార్తలు