Telangana Cabinet: హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. కేబినెట్ కీలక ఆదేశాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.

  • Share this:
    హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై తెలంగాణ మంత్రివర్గం సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కెబినెట్ ఆదేశించింది. కేబినెట్ భేటీలో మొదటగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.

    స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని మంత్రివర్గానికి వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మంది రెండు డోసులు ఇవ్వటం జరిగిందని తెలిపారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభమవుతుందని విరవించారు.

    ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులకు కేబినెట్ సూచించింది. ఇక గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కెబినెట్ ఆదేశించింది.

    Telangana BJP: కేంద్రమంత్రిపై తెలంగాణ బీజేపీ అసహనం.. ఇలా చేస్తే ఎలా అంటూ..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్.. సైలెంట్ అయిన సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో చర్చ

    ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా వున్నామని వైద్యాధికారులు కెబినెట్‌కు వివరించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి కెబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: