Telangana Cabinet: పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణతో పాటు వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌లు సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థ బాగు కోసం అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమానికి సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాఠశాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేసేందుకు నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా పాఠశాలలను ఎంపిక చేసుకుని వాటిని ఆధునీకరించారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
ఇక ప్రభుత్వ పాఠశాల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్‌ను ఫాలో అవుతుందేమో అనే చర్చ సాగుతోంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనూ విద్యాబోధన ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే దీనిపై అనేక వివాదాలు చేలరేగాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. రాజకీయంగానూ ఈ అంశంపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య పెద్ద రగడ కొనసాగింది. అయితే జగన్ సర్కార్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరించింది. అలా ఏపీ ప్రభుత్వం కొన్నేళ్ల కిందట మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి పేరుతో కొత్తగా ప్రారంభించనుందా ? అనే చర్చ మొదలైంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.