తెలంగాణ కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్ ఇదే.. కేబినెట్ ఆమోదం

కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ ఫైనల్ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఏడంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 11:16 PM IST
తెలంగాణ కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్ ఇదే.. కేబినెట్ ఆమోదం
నూతన సచివాలయ నమూనా
  • Share this:
తెలంగాణ పాత సచివాలయ భవనాన్ని ఇప్పటికే కూల్చివేసిన ప్రభుత్వం.. కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సచివాలయం డిజైన్‌పై కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. పలు మార్లు సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు చర్చలు జరిపారు. కొన్ని మార్పులు సూచించి తుది మెరుగులు దిద్దారు. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ ఫైనల్ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఏడంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు.

కాగా, పాత సచివాలయం భవనాలు శిథిలావస్థలో ఉన్నందున, దాన్ని కూల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. కూల్చివేతకు ముందు ఈ అంశంపై హైకోర్టులో కొన్ని రోజులు కేసు నడిచింది. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో జూలై 7 కూల్చివేత పనులను ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే పాత సచివాలయాన్ని నేలమట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కూల్చివేత సమయంలోనూ హైకోర్టు పలుమార్లు స్టే విధించినా.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత ప్రక్రియ ముగిసింది. శిథిలాల తరలింపు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత వీలైనంత త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్లు పిలవనుంది. రూ.500 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading