హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget 2023 : తెలంగాణ బడ్జెట్ .. ఇంకా ఆమోదించని గవర్నర్

Telangana Budget 2023 : తెలంగాణ బడ్జెట్ .. ఇంకా ఆమోదించని గవర్నర్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ (File Photos)

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ (File Photos)

Telangana State Budget 2023-24 : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఐతే... దీనికి ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంకా ఆమోదం తెలపలేదు. దాంతో ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana Budget 2023-2024 : తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) ఇంకా ఆమెదించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం భగ్గుమంటోంది. టైమ్ అయిపోతోందనీ.. ఎలాగైనా బడ్జెట్‌ (telangana budget 2023-24)ను ఆమోదింపజేసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం.. ఇందుకోసం ఇవాళ హైకోర్టుకు వెళ్లి... లంచ్ మోషన్ పిటిషన్ వెయ్యాలి అనుకుంటోంది అని తెలిసింది. ఐతే.. ఇక్కడో కీలక పాయింట్ ఉంది. ప్రభుత్వం ఏది ఇచ్చినా గవర్నర్ వెంటనే ఆమోదించేయాలి అనే రూల్ లేదు. ఆమోదించాలా లేదా అనేది నిర్ణయించుకునే హక్కు గవర్నర్‌కి ఉంటుంది. కాబట్టి.. త్వరత్వరగా ఆమోదించేయాలి అని తొందరపెట్టే అవకాశం ప్రభుత్వానికి లేదు. కాకపోతే.. ఏ గవర్నర్ అయినా.. వెంటనే ఆమోదించేస్తుంటారు. దీనిపై ఎక్కువగా ఆలోచించరు. కానీ.. గవర్నర్ తమిళిసై మాత్రం కొంత టైమ్ తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఈలోపే గవర్నర్.. బడ్జెట్‌ను ఆమోదించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ఆమోదిస్తారో లేదో అనే టెన్షన్ ఉంది. ఇక్కడ ప్రభుత్వ తీరుపై గవర్నర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ఇదివరకు రెండేళ్లుగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరపడంతో... ఆమె ఈసారి దీనిపై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమోదం తెలపట్లేదేమో అనే డౌట్ ప్రభుత్వంలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఈమధ్య రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధపడలేదు. హైకోర్టు ఆదేశాలతో నిర్వహించకతప్పలేదు. ఆ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. కొన్ని విమర్శలు చేశారు. తద్వారా ఆమె ప్రభుత్వంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Budget 2023 : రేపు పార్లమెంట్ ప్రారంభం.. 1న బడ్జెట్ .. కీ పాయింట్స్

ఫిబ్రవరి 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తర్వాతి రోజు రెండు సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ ఆమోదించనిదే ఇది జరగదు. ప్రభుత్వం గనుక హైకోర్టుకు వెళ్తే.. ఈ సమస్య మరింత రాజకీయ రగడకు దారి తీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది.

First published:

Tags: CM KCR, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Telangana, Telangana Budget

ఉత్తమ కథలు