TELANGANA BUDGET 2022 CM KCR PRESTEGIUS DALIT BANDU SCHEME GETS RS17700 CRORE ALLOTMENT BY FM HARISH RAO MKS
CM KCR ప్రతిష్టాత్మక దళిత బంధు పథకానికి Telangana Budgetలో ఎంత కేటాయించారో తెలుసా?
కేసీఆర్ దళిత బంధు
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళిత బంధుకు ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయనే ఉత్కంఠకు తెరపడింది. ఈసారి దళిత బంధు పథకం కోసం ఏకంగా 17,700 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
తెలంగాణలో బడ్జెట్ హడావుడి మొదలైనప్పటి నుంచి దాదాపు అందరూ చర్చించుకుంటోన్న అంశం.. దళిత బంధు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళిత బంధుకు ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయనే ఉత్కంఠకు తెరపడింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. కేసీఆర్ మానసపుత్రిక దళిత బంధుకు ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే, ఈ సంఖ్య కేసీఆర్ అంచనాకు తగ్గట్టు లేకున్నా, మిగతా కేటాయింపులతో పోల్చుకుంటే భారీ మొత్తమనే చెప్పాలి.. (వీడియో కిందుంది)
‘దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లు కేటాయిద్దాం. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి’అంటూ సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగానే మాట్లాడారు. ఆ మేరకే వాస్తవ కేటాయింపులు ఉంటాయని అంతా భావించారు. కానీ సంఖ్య కాస్త తగ్గింది. దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు.
గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికివందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రారంభం కావడంతో దళిత బంధు కేసీఆర్ ఎన్నికల గిమ్మిక్కనే విమర్శలు వచ్చాయి. హుజూరాబాద్ ఫలితం తర్వాత దళిత బంధు దాదాపు ఆగిపోవడంతో తాము చెప్పిందే నిజమైందని విపక్షాలు వ్యాఖ్యానించాయి. కానీ సదరు విమర్శలను పటాపంచెలు చేస్తూ కేసీఆర్ సర్కారు ఇవాళ దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించింది. దళిత బంధును రాజకీయ కోణంలో చూడరాదని, పేదల బతుకుల్లో సమూల మార్పు కోసమే దీనిని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ గతంలోనూ చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.