Home /News /telangana /

TELANGANA BUDGET 2022 AS NO SPEECH IN ASSEMBLY GOVERNOR TAMILISAI VISITS YADADRI TEMPLE ON BUDGET DAY BJP MLAS SLAMS CM KCR MKS

అమెకు అవమానం! -నల్ల బ్యాడ్జిలతో బీజేపీ ఎమ్మెల్యేలు : బడ్జెట్ వేళ యాదాద్రిలో గవర్నర్ తమిళిసై

బడ్జెట్ వేళ యాదాద్రిలో గవర్నర్

బడ్జెట్ వేళ యాదాద్రిలో గవర్నర్

బడ్జెట్ వేళ కీలకంగా వ్యవహరించే గవర్నర్ ఇవాళ మాత్రం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తొలగించడాన్ని ఘోర అవమానంగా అభివర్ణించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. నల్ల బ్యాడ్జీలతో సభలో నిరసనకు దిగారు..

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Budget Session) తొలిరోజే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.. అది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని నిరాకరించడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేసినా, కేసీఆర్ సర్కారు మాత్రం ముందుకే కదిలింది. సోమవారం ఉదయం 11.30కు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ (Telangana Budget 2022) ప్రవేశపెట్టారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పద్దును ప్రవేశపెట్టారు. బడ్జెట్ వేళ ప్రతిసారి కీలకంగా వ్యవహరించే గవర్నర్ ఇవాళ మాత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తొలగించడాన్ని ఘోర అవమానంగా అభివర్ణించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. నల్ల బ్యాడ్జీలతో సభలో నిరసనకు దిగారు..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ సర్కారు తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. యాదాద్రిలో గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించిన ఆమె బాలాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వెంట యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు. మరోవైపు,

యాదాద్రిలో గవర్నర్ తమిళిసై

ఈరోజు పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేశారా? ఇంకొన్ని గంటల్లో షాక్ తప్పదు! Petrol Diesel Price రూ.20 పెంపు!!


గవర్నర్​ ప్రసంగం లేకుండానే బడ్జెట్​ సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల ప్రారంభంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదని... ఎమ్మెల్యేలు ఎంత? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తాము కొద్ది మందిమే ఉన్న సమయంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు తామున్నది ముగ్గురమే కావచ్చని కానీ రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల పేర్కొన్నారు. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గళం విప్పుతామన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే బయట పోరాడుతామని ఈటల పేర్కొన్నారు.

యాదాద్రిలో గవర్నర్ తమిళిసై

మాంసం ప్రియులకు షాక్: భారీగా పెరిగిన చికెన్ ధర.. 1కిలో రూ.300 -రాబోయే రోజుల్లో కొండెక్కడం ఖాయం!


యాదాద్రిలో గవర్నర్ తమిళిసై పూజలు


మరో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం అన్యాయమన్నారు. సంప్రదాయం ప్రకారం నిర్వహించకుండా ఒక మహిళ అని కూడా చూడకుండా గవర్నర్‌ను అవమానించారన్నారు. తమ నేతలను ఓడించేందుకు కేసీఆర్ ధన బలాన్ని, అధికార బలాన్ని వాడుకున్నారన్నారు. అసెంబ్లీలో తమ గళాన్ని నొక్కివేయలని చూస్తున్నారన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. మత్తుల తెలంగాణ అయిందని రాజసింగ్ పేర్కొన్నారు. కాగా, గవర్నర్ కు అవమానంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రచ్చకు దిగడంతో స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Governor Tamilisai Soundararajan, Telangana Budget 2022, Ts assembly sessions, Yadadri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు