Telangana: తాను మరణిస్తూ.. ఐదుగురికి పునర్జన్మనిచ్చిన తాపీ మేస్త్రీ..

ప్రతీకాత్మక చిత్రం

బ్రెయిన్ డెడ్ అయిన ఓ తాపి మేస్త్రీ.. ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు.

  • Share this:
    ఓ వ్యక్తి తాను మరణిస్తూ ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్‌ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కిష్టయ్య, సత్తెమ్మ దంపతులకు రెండో సంతానమైన రాములు(24) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. కొంతకాలం కిందటే రాములకు అరుణ అనే మహిళతో వివాహం అయింది. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉన్నారు. తన సంపాదనతో తల్లిదండ్రులను, భార్యను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం రాములు రెండు కాళ్లు, రెండు చేతులు చచ్చుబడి పోయాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు రాములును హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.

    దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. దీంతో రాములు కుటుంబ సభ్యులు షాక్‌లోకి వెళ్లిపోయారు. తమ కళ్లముందే కన్నకొడుకు అలా అయిపోవడంతో తమకు దిక్కెవరనీ కన్నీరుమున్నీరుగా విలపించారు. గర్బవతిగా అరుణ భర్తను ఆ స్థితిలో చూసి తల్లడిలిపోయింది.

    ఇక, రాములు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆస్పత్రి సిబ్బంది అవయవ దానంపై వారికి అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే రాములు అవయవాలను దానం చేయడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. రాములు అవయవాలను ఐదుగురికి దానం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొడుకు పోయిన బాధను దిగమింగుకొని అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యలను వైద్యులు ప్రశంసించారు. రాములు తాను మరణిస్తూ ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: