వారికి రూ.25లక్షల పరిహారం.. ఇంటర్ బోర్డు వివాదంపై కాంగ్రెస్ డిమాండ్

చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: April 23, 2019, 11:45 AM IST
వారికి రూ.25లక్షల పరిహారం.. ఇంటర్ బోర్డు వివాదంపై కాంగ్రెస్ డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 11:45 AM IST
ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. ఇంటర్ బోర్డులో జరిగిన తప్పుల మీద అధికారుల సమాధానాలు తప్పించుకునే విధంగా ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్య సమాధానంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ విషయంపై జోక్యం చేసుకుని గంటల్లో సమస్యకు పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి కోరారు. అలాగే, బోర్డులో తప్పులకు కారకులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్ధులకు తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు.

ఇంటర్ బోర్డు తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయానికి తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...