ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువును అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

news18-telugu
Updated: October 26, 2019, 4:17 PM IST
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్...  పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం  విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం (అక్టోబర్ 25) ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించే గడువును అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం విద్యార్థులు అక్టోబర్ 29  నుంచి నవంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు.. గతంలో ఫెయిలైన విద్యార్థులు (ఫెయిల్, ఒకేషనల్), ప్రైవేట్ విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్య రుసుముతో డిసెంబరు 16 వరకూ పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>