Home /News /telangana /

TELANGANA BJP STATE PRESIDENT BANDI SANJAY COUNTERS AGAINST MAHADHARNA VRY

Bandi sanjay : ధాన్యం కొనుగోలు చేయకుండా సీఎం ధర్నా చేయడం సిగ్గు చేటు ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bandi sanjay : రైతుల సమస్యలను రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అన్నారు. ధాన్యం కొనుగోలును రెండు ర్టీల మధ్య సమస్యగా మార్చవద్దని సీఎం కేసిఆర్‌ను కోరారు.

    ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టనున్న మహాధర్నా పై బండి సంజయ్ స్పందించారు. రైతుల సమస్యను టీఆర్ఎస్ రాజకీయం చేయవద్దని హితవు పలికారు. ఇది రెండు పార్టీల మధ్య సమస్య కాదని , రైతుల సమస్య అని అనేక అడ్డంకులు సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన సూచించారు. ఇక సీఎం కేసిఆఆర్ గ్రౌండ్‌లెవల్‌లోకి వెళ్లి పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా.. అని ఆయన ప్రశ్నించారు.

    తాను కోనుగోళ్లను పరిశీలించేందుకు వెళ్లామని తెలిసే కొనుగోళ్లను ప్రారంభించారని అన్నారు. ఇక మార్కెట్‌లలో బీజేపి వారితో మాట్లాడితే వడ్లు కొనుగోలు చేయమని బెదరించారని ఆయన చెప్పారు. ఇక ఎక్కడ రైతుల సమస్యలు వెలుగులోకి వస్తాయో అనే భయంతోనే బీజేపీపై దాడులకు దిగారని విమర్శించారు.

    ఇది చదవండి : మహాధర్నాలో సీఎం కేసిఆర్.. భారీ ఏర్పాట్లలో మంత్రులు


    సిఎం కేసిఆర్ ఆదేశాలతో డీజీపి కూడా కనీసం ఫోన్ చేస్తే రిసీవ్ కూడా చేయడలం లేదని, దీనికి అదనంగా కనీసం కేసులు కూడా బుక్‌ చేసుకుంనేందుకు పోలీసులు వెనకడగు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తల వలే మారిపోయారని ఆయన ఫైర్ అయ్యారు. ఇక సీఎం కేసిఆర్ ఒక్కోసారి ఒక విధంగా మాట్లాడతారని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలను జై కొట్టిన సీఎం ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు..

    మరోవైపు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను తప్పుదారి పట్టించేందుకే సీఎం కేసిఆర్ ధర్నా కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.. సీఎం ధర్నా చేపట్టడడం సిగ్గుచేటని ఆయన ఫైర్ అయ్యారు.

    రైతులకు మద్దతుగా సీఎం కేసిఆర్ పాల్గొననున్న మహాధార్నకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు.. తెలంగాణ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్.. నేరుగా ధర్నాలో పాల్గొననున్నారు. దీంతో రేపు జరగనున్న ధర్నా కార్యక్రమం ఉత్కంఠగా మారింది.ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఇప్పటకే రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఇందుకు అనుగుణంగా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గురువారంనాడు ఇందిరాపార్కు వద్ద మహాధర్న చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసిఆర్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు.

    కాగ ధర్న చౌక్ వద్ద ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావుతోపాటు శ్రీనివాసయాదవ్‌లు కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..రైతుల కోసమే తాము ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం అని స్పష్టం చేశారు..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Telangana bjp, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు