Bandi sanjay : వరి కొనుగోలుపై బండి సంజయ్ దీక్ష..

బండి సంజయ్(ఫైల్ ఫొటో)

Bandi sanjay : ఎండాకాలంలో వరి పంటలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వైఖరికి నిరసనగా బీజేపీ నిరసన దీక్షకు దిగనుంది. వరి -ఉరి అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.

  • Share this:
    రానున్న కాలంలో కేంద్రం వరి కోనుగోలుకు నిరాకరించడంతో రాష్ట్రంలో వరి పంటలపై ( paddy ) నీలి నీడలు అలుముకున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిని పండిస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తాయరయ్యె పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుత వానకాలం సీజన్‌లోనే బియ్యాన్ని కోనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేయడంతో సీఎం కేసిఆర్ ( cm kcr ) మూడు రోజుల తన ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని ఒప్పించి వానకాలం పంటను కొనేవిధంగా ఒప్పించినట్టు తెలిపారు. అయితే తాజాగా రానున్న ఎండాకాలంలో కూడా పెద్ద ఎత్తున వరిని పండించేందుకు రైతులు సిద్దం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. వరిని వేయకుండా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రజా ప్రతినిధులకు సైతం దిశనిర్దేశం చేశారు. దీంతో అధికారులు సైతం రైతులకు హెచ్చరికలు ( warning) జారీ చేయడంతో ఈ నిర్ణయం వివాదస్పదంగా మారుతోంది.

    ఈ క్రమంలోనే బీజేపీ ( bjp ) వరి కొనుగోలుపై కార్యచరణనను చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన దీక్షను చేపట్టనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారని ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేపడతామని ప్రకటించారు.

    ఇది చదవండి : ఆర్టీసీ డ్రైవర్‌కు.. డ్రైవింగ్‌లో ఫిట్స్... తప్పిన పెను ప్రమాదం


    ఇది చదవండి : ఆర్టీసీలోనే నైతిక విలువలు.. మెట్రో సంఘటనతో వీడియో పోస్ట్ ..


    రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుంటే టీఆర్ఎస్ ( TRS ) ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేంటో అర్థం కావడం లేదని , సీఎం కేసిఆర్ ప్రకటనలతో రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసంగా లేదని ఆయన దుయ్యబట్టారు.( cm kcr ) .. తరతరాలుగా సాంప్రదాయకంగా వరి మాత్రమే సాగు చేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా అకస్మాత్తుగా ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.. ఈ సంధర్బంగా వరి సాగు చేసే రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు, రైతులకు బిజెపి అండగా ఉంటుందని చెప్పారు... ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయ వ్యతిరేక వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘‘వరి – ఉరి ప్రభుత్వ వైఖరిపై బిజెపి రైతు దీక్ష’’ చేపట్టనున్నన్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. .
    Published by:yveerash yveerash
    First published: